: టీనేజ్ నటిని దారుణంగా వేధించిన యాడ్ ఫిల్మ్ డైరెక్టర్... కటకటాల్లోకి!
సమాజంలో పేరు, హోదా ఉన్నవారు కూడా మృగాళ్లుగా మారుతున్నారనడానికి ఇది మరో ఉదాహరణ. దేశ రాజధాని న్యూఢిల్లీలో రవీందర్ (47) అనే వ్యక్తిపై ఓ టీనేజ్ నటి కేసు పెట్టడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే, రవీందర్ లజపత్ నగర్ సమీపంలో నటనలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద ఓ మైనారిటీ తీరని బాలిక శిక్షణ పొందుతోంది. గత నెలలో షూటింగ్ నిమిత్తం వీరి టీమ్ ఫతేపూర్ బెరీ ప్రాంతానికి వెళ్లిగా, ఆ బాలికపై తన దుర్బుద్ధి చూపాడు. డాక్యుమెంటరీలు, యాడ్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఉన్నాయని, తనకు సహకరిస్తే బాలీవుడ్ సినిమాలోనూ అవకాశం కల్పిస్తానని మాయమాటలు చెప్పాడు. బాలిక అంగీకరించకపోవడంతో బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ, దారుణంగా వేధించాడు. యూనిట్ నుంచి తీసేస్తానని బెదిరించాడు కూడా. ఈ మొత్తం ఘటనలను ఆ బాలిక ఢిల్లీకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రవీందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.