: కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ కు గుండెపోటు... ఆసుపత్రికి తరలింపు


ప్రముఖ కన్నడ చిత్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను బెంగళూరులోని విటల్ మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటనే ఆయనకు ఈసీజీ, యాంజియోగ్రామ్ నిర్వహించారు. దాంతో ధమనుల్లో రెండు బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలో ఆయనకు యాంజియోప్లాస్టీ గానీ, ఓపెన్ హార్ట్ సర్జరీగానీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం తన సోదరుడికి ఎలాంటి ప్రమాదం లేదని రాజ్ కుమార్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ అంటున్నారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారని అన్నారు. ఉదయం జిమ్ లో ఉన్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని రాజ్ కుమార్ చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది.

  • Loading...

More Telugu News