: చాక్లెట్ ప్రియులకు తీపి కబురు...త్వరలో మెడిసిన్ చాక్లెట్


చాక్లెట్ ప్రియులకు తీపి వార్త...త్వరలో మార్కెట్ లోకి మెడిసిన్ చాక్లెట్ రానుంది. మెడిసిన్ చాక్లెట్ అంటే చేదుగా ఉంటుందని భావించకండి. ఇది సాధారణ చాక్లెట్ లానే ఉంటుంది. కాకుంటే చాక్లెట్ తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా, వీటి స్థాయి సాధారణంగానే ఉండేలా దీనికి రూపకల్పన చేసినట్టు చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఓ చాక్లెట్ కంపెనీ ఈ మెడిసిన్ చాక్లెట్ ను రూపొందించింది. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉండే చాక్లెట్, కకోలను కలిపి చాక్లెట్ తయారు చేశారు. సాధారణ చాక్లెట్ లో 70 శాతం షుగర్, కొవ్వు ఉంటాయి. కుకా జోకో రూపొందించిన ఈ చాక్లెట్ లో కేవలం 35 శాతం షుగర్, కొవ్వు ఉంటాయని తెలిపారు. కోకో మొక్క సారంతో కకోలో ఉండే చేదును వేరు చేయవచ్చని, అలాగే చాక్లెట్ లో ఉండే కొవ్వును కూడా తొలగించవచ్చని, కోకోలో ఉండే వైద్య ప్రయోజనాలు పొందవచ్చని తయారీదారు తెలిపారు. సాధారణ చాక్లెట్ లో ఉండే కొవ్వు, షుగర్ లను తగ్గించామని, అయితే వీటిని చాక్లెట్ లో 10 శాతానికి పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News