: పాలపిట్టను బంధించడం చట్టవిరుద్ధం: అక్కినేని అమల
మొక్కు కోసం పాలపిట్టను బంధించడం నేరమని బ్లూ క్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమల అన్నారు. జూబ్లీ హిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈరోజు నిర్వహించిన ఏనిమల్ వెల్ఫేర్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ దసరా రోజున పాలపిట్టను పంజరాల్లో బంధించి వ్యాపారాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. పాలపిట్టలను బంధించిన సమాచారం ఎవరి దృష్టికైనా వస్తే, 7674922044,9849027601,9966629858 నంబర్లకు ఫోన్ చేయాల్సిందిగా ఆమె కోరారు. కాగా, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. దసరా పండుగరోజున ప్రజలు ఈ పిట్టను చూడటమన్నది ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం.