: అమీర్ పేట భూవివాదం కేసులో గవర్నర్ రోశయ్యకు ఊరట


హైదరాబాద్ లోని అమీర్ పేట భూవివాదం కేసులో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. రోశయ్య సహా 17 మందిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. అమీర్ పేటలోని 9 ఎకరాల 14 కుంటల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై 2009-10 మధ్యలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లోనే ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తరువాత తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ రోశయ్య ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవ్వాళ ఆ అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

  • Loading...

More Telugu News