: ఇర్ఫాన్ ఖాన్ కు 10 లక్షల మంది ఫేస్ బుక్ అభిమానులు
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు ఫేస్ బుక్ ఖాతాలో లైక్ లు ఒక రేంజ్ కు చేరాయి. పదిలక్షల మంది అభిమానులు ఆయన ఫేస్ బుక్ ఖాతాలో చేరారు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ ఖాన్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. ‘నాపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. నా నట జీవిత ప్రయాణంలో ప్రతి అడుగూ ఒక మైలురాయిలా నిలిచిపోతుంది’ అని ఇర్ఫాన్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ కీలక పాత్రల్లో నటించిన ‘జాజ్బా’ చిత్రం శుక్రవారం నాడు విడుదల కానుంది.