: ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ నుంచి షారుక్ కు ఆహ్వానం
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ యూకేలోని ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో ప్రసంగించబోతున్నారు. ఇందుకోసం ఆ వర్శిటీ కింగ్ ఖాన్ కు ఆహ్వానం పలికింది. "బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ను ప్రత్యేక అతిథిగా ఈ నెల 15న యూనివర్శిటీ సందర్శించాలని ఆహ్వానించాం. బాలీవుడ్ మోస్ట్ పాప్యులర్ నటుల్లో ఒకరైన ఆయన వర్సిటీ కొత్త కళాశాలలో విద్యార్థులకు పబ్లిక్ లెక్చర్ ఇవ్వనున్నారు" అని వర్సిటీ తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానగణం ఉన్న షారుక్... ఏ విషయంపైన అయినా అనర్గళంగా మాట్లాడుతారన్న విషయం తెలిసిందే.