: గో మాతను ఎవరైనా చంపాలని చూస్తే ఊరుకునేది లేదు: బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
ఆవు మాంసం భుజించాడన్న ఆరోపణతో యూపీలో ఓ ముస్లిం వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటనపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవును కాపాడుకోవడానికి తాము ఎవరినైనా చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని ప్రకటించారు. గో మాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము వూరుకోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పాకిస్థాన్ కు చెందినవాడన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి యూపీ సీఎం ఆర్థిక సాయం ప్రకటించడాన్ని కూడా సాక్షి తప్పుబట్టారు.