: మక్కా తొక్కిసలాటలో 74కు చేరిన భారతీయ మృతుల సంఖ్య
సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 74 మంది భారతీయులు చనిపోయినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. సెప్టెంబర్ 24న మక్కాలోని మీనాలో చోటుచేసుకున్న తీవ్ర తొక్కిసలాటలో మొత్తం 769 మంది చనిపోయారని సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.