: అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే, మత్తుమందిచ్చి...అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్!


అనారోగ్యంతో ఉన్న యువతి ఆసుపత్రికి వస్తే, ఇంజక్షన్ చేయాలని చెప్పిన వైద్యుడు ఆమెకు మత్తుమందిచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని తిరుమలగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇక్కడి లాల్ బజార్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి గత కొంత కాలంగా చర్మవ్యాధితో బాధపడుతోంది. నిన్న సాయంత్రం గీతా నర్సింగ్ హోంకు వెళ్లగా, అక్కడి డాక్టర్ ఇంజక్షన్ చేయాలని చెప్పి బెడ్ పై పడుకోబెట్టి, ఇంజక్షన్ ఇచ్చాడు. ఆపై మగత కమ్మేసింది. బాధితురాలికి జరుగుతున్న సంఘటనలు తెలుస్తున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఆ డాక్టర్ ఏం చేసినా ఊరకుండిపోయింది. కొంతసేపటికి కాస్త శక్తిని తెచ్చుకుని తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. బాధితురాలిని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ డాక్టర్ మాత్రం, ఆమె నీరసంగా ఉండటంతో ఇంజక్షన్ ఇచ్చానని, ఆమె నిస్సత్తువతో నిద్రలోకి జారుకుందని చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News