: యూపీలో ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై జైట్లీ స్పందన
ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో ఆవు మాంసం తిన్నాడని ఆరోపిస్తూ ఓ ముస్లిం వ్యక్తిని కొట్టి చంపిన ఘటనపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని న్యూయార్క్ లో మీడియా ప్రశ్నించగా మాట్లాడారు. అలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. భారత్ చాలా పరిపక్వత చెందిన దేశమని, అటువంటి ఘటనలు దేశ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ప్రభుత్వ విధానాలను పక్కదారి పట్టిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత కూడా అని సూచించారు. ఏదేమైనా ఆ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని జైట్లీ తెలిపారు.