: పోకిరీ తాట తీసిన మహిళ... చెప్పు దెబ్బలతో బెంబేలెత్తిన పటాన్ చెరు యువకుడు


తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆకతాయిల తాట తీస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్నటిదాకా వేధింపులను మౌనంగానే భరించిన మహిళలు ఇటీవల దైర్యం చేస్తున్నారు. తమపై వేధింపులకు దిగుతున్న పోకిరీలకు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నారు. ఇలాంటి ఘటనే నిన్న రాత్రి హైదరాబాదు శివారు ప్రాంతం పటాన్ చెరులో జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న అక్కడి శ్రీరాంనగర్ కు చెందిన ఓ యువకుడిని అతడి వేధింపులతో చిర్రెత్తుకొచ్చిన ఓ మహిళ చెప్పుతో చెంపలు వాయించింది. ఉన్నపళంగా కాలి చెప్పు తీసి మహిళ దాడికి దిగడంతో బిత్తరపోయిన ఆ ఆకతాయి ముఖంపై చెప్పు దెబ్బలు పడకుండా కాపాడుకోవడానికి యత్నించడం మినహా మరేమీ చేయలేకపోయాడు. చెప్పు చేతి నుంచి జారేదాకా ఆకతాయిని చితక్కొట్టిన ఆ మహిళ, ఇంకా కోపం చల్లారక పిడిగుద్దులతో అతడి వీపును విమానం మోత మోగించింది.

  • Loading...

More Telugu News