: రైతులకు సాయం చేసేందుకు సెలబ్రిటీలు, సినీనటులు ముందుకు రావాలి: రేవంత్ రెడ్డి


సెలబ్రిటీలు, సినీనటులు, వ్యాపారవేత్తలు తెలంగాణలోని రైతులకు అండగా నిలవాలని టి.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. పక్కరాష్ట్రాల నటులను స్పూర్తిగా తీసుకుని ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి 'రైతు కోసం' టీడీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, రైతులకు భరోసా కల్పించేందుకు సినీ నటులు ఏ కార్యక్రమం చేపట్టినా తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఇది తమ రాష్ట్రం కాదు అని వారు భావిస్తే వారిష్టమన్నారు. అయితే వారు స్పందించాలని సూచన మాత్రమే చేస్తున్నామని రేవంత్ తెలిపారు.

  • Loading...

More Telugu News