: పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆబ్కారీ శాఖ తనిఖీలు... 53 మంది అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లో ఆబ్కారీ శాఖ మరోసారి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇవాళ ఉదయం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అధికారులు 9 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ప.గో జిల్లాలో 4,800 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి 29 మందిని అరెస్టు చేశారు. అంతేగాక 400 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో 3,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 600 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఇక్కడ 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల కిందట కూడా ఏపీలోని పలు జిల్లాల్లో తనిఖీలు చేసి పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.