: తణుకులో కిడ్నాప్ కలకలం... స్కూలుకెళుతున్న ఐదేళ్ల బాలుడి అపహరణ


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నేటి ఉదయం జరిగిన ఓ కిడ్నాప్ కలకలం రేపింది. చక్కగా తయారై సోదరితో కలిసి పాఠశాలకు వెళుతున్న ఐదేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. బైక్ పై దూసుకువచ్చిన ఓ వ్యక్తి వచ్చిన వేగంతోనే బాలుడిని ఎత్తుకుని కనుమరుగయ్యాడు. దుండగుడి చర్యతో భయకపింతురాలైన బాలుడి సోదరి పరుగుపరుగున ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వెంటనే అప్రమత్తమైన బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News