: గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీపీఎం ప్రజా చైతన్య యాత్ర
గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పాదయాత్రను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రారంభించారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఆరు రోజుల పాటు 120 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా ఉండేందుకు సీపీఎం ఈ యాత్ర చేస్తోంది. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఈ నెల 11న విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట కూడా సీపీఎం నిరసన చేయనుంది.