: ఎంత పని చేసిందీ పప్పీ!


ఓ చిన్న పప్పీ కోసం జరిగిన గొడవలో 8 సంవత్సరాల బాలికను 11 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని తెన్నెస్సీలో జరిగింది. వివరాల్లోకి వెళితే, లతాషా డయ్యర్ అనే మహిళ తన కుమార్తె మెక్ కైలాతో కలసి వైట్ పినీ అనే ప్రాంతంలో నివసిస్తుండేది. ఆ పక్కింట్లోనే ఉండే బాలుడు ఆ బాలికను నిత్యమూ ఏడిపిస్తుంటాడు. కైలా చిన్న కుక్క పిల్లను పెంచుకుంటుండేది. సోమవారం నాడు ఆ కుక్క పిల్లను చూస్తానని పక్కింటి బాలుడు అడిగితే కైలా ఒప్పుకోలేదు. దీంతో అతడు ఆమె గుండెల్లోకి కాల్చాడు. గతంలో తాను ఆ బాలుడి గురించి స్కూల్ ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేస్తే, కొంతకాలం పాటు ఏడిపించకుండా ఉన్నాడని, ఆపై తిరిగి వేధించడం మొదలు పెట్టాడని లతాషా వివరించింది. "ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. ఆ బాలుడికి ఇప్పుడిక గుణపాఠం నేర్చుకుంటాడనే అనుకుంటున్నా. నా చిన్నారి నాకు కావాలి" అని విలపిస్తూ చెప్పారు. బాలుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశామని జెఫర్సన్ కౌంటీ పోలీసు అధికారి బుడ్ మెక్ కోయిగ్ వెల్లడించారు. తదుపరి విచారణ 28కి వాయిదా పడిందని, అప్పటివరకూ జువైనల్ సెంటర్ కు అతడిని తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారని వివరించారు.

  • Loading...

More Telugu News