: రాత్రిపూట అంతరిక్షం నుంచి చూస్తే, ఇండియా పాక్ సరిహద్దు ఇలా మెరుస్తుంటుంది!


ఈ ప్రపంచంలో చీకటి పడ్డ తరువాత దేశాల సరిహద్దులు అంతరిక్షం నుంచి కనిపిస్తాయా? అని ఎవరైనా అడిగితే, ఇదేం ప్రశ్న... అసలు పగలైనా సరిహద్దులు ఆకాశం నుంచి చూస్తే కనిపిస్తాయా? అన్న ఎదురు ప్రశ్న సమాధానంగా వస్తుంది. మిగతా దేశాల మాటేమోగానీ, ఇండియా, పాక్ బార్డర్ రాత్రిపూట విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుంది. నిత్యమూ చొరబాట్లు, రాత్రిపూట కాల్పుల మోతలు వినిపించే ఈ ప్రాంతంలో రెండు దేశాలూ భద్రతాపరంగా గట్టి చర్యలు తీసుకోవడంతో, అంతరిక్షం నుంచి చూసినా సరే సరిహద్దులు మెరుస్తూ కనిపిస్తుంటాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా, భారత్, పాక్ సరిహద్దులతో పాటు కరాచీ, ఇండస్ నదీ ప్రాంతం, హిమాలయాలను చూపుతూ తీసిన ఓ చిత్రాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచింది. ఆ చిత్రాన్ని మీరూ చూడండి. భారత్, పాక్ సరిహద్దులు ఎలా మెరుస్తూ కనిపిస్తున్నాయో!

  • Loading...

More Telugu News