: నెలకు రూ. 600 వరకూ పెరగనున్న కేబుల్ బిల్!


కేబుల్ రంగం డిజిటలైజేషన్ విధానాన్ని అమలు చేస్తే పే చానల్ రేట్లు, పన్నులు కలుపుకుని ఒక్కో కనెక్షన్ కు రూ. 500 నుంచి రూ. 600 వసూలు చేయాల్సి ఉంటుందని చెబుతున్న కేబుల్ ఆపరేటర్లు, దీన్ని నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన టీవీ ప్రసారాలు నిలిపివేయనున్నట్టు ప్రకటించారు. ఎంఎస్ఓలు ధరలు పెంచడం వల్ల ఆపరేటర్లు ఆ భారాన్ని కస్టమర్లపై మోపాల్సి వస్తుందని, పేదలు ఇంత రేట్లు భరించలేరని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ఎం జితేందర్ వివరించారు. 7వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ప్రసారాలు నిలిపివేయనున్నామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News