: పెద్దోడి వయసు 25 ఏళ్లు, చిన్నోడిదేమో 26 ఏళ్లట...లాలూ కొడుకుల ఏజ్ పై వివాదం


బీహార్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు పలు పార్టీలతో జట్టు కట్టిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ఎన్నికల్లో లాలూ పుత్రరత్నాలు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లిద్దరూ రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారు. వైశాలిలోని మహువా నియోజకవర్గం నుంచి పెద్ద కొడుకు తేజ్ బరిలోకి దిగుతుండగా, చిన్న కుమారుడు తేజస్వీ అదే జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ బరిలోకి దూకేశాడు. తేజ్ ప్రతాప్ నిన్న తన తండ్రితో కలిసి నామినేషన్ దాఖలు చేయగా, చిన్న కుమారుడు గత శనివారమే నామినేషన్ వేశారు. లాలూ కొడుకులిద్దరూ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద చర్చకు తెరతీశాయి. పెద్ద కుమారుడు తేజ్ తన వయసును 25 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే అతడి కంటే చిన్నోడైన తేజస్వీ మాత్రం తన వయసును 26 ఏళ్లుగా పేర్కొంటూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ అంశం ఆధారంగా నామినేషన్లను తిరస్కరించే అవకాశం లేదని బీహార్ అదనపు ఎన్నికల అధికారి లక్ష్మణన్ చెప్పారు. ఈ విషయంలో కోర్టులో తాము దాఖలు చేయనున్న పిటిషన్ల విచారణకు హాజరయ్యే అభ్యర్థులు తాము పొందుపరచిన వివరాలు వాస్తవమేనని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News