: జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం... తగలబడిపోయిన రుషికా కెమికల్స్ గోదాము


హైదరాబాదు శివారులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదాము పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది. ట్యాంకర్ నుంచి రసాయనాలను దించుతున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు దాదాపు 5 గంటల పాటు అదుపులోకి రాలేదు. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. గోదాములో రాజుకున్న మంటల కారణంగా దాదాపు 5 చదరపు కిలో మీటర్ల పరిధిలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనావాసాల మధ్య నిర్ణీత అనుమతులు లేకుండానే కెమికల్ ఫ్యాక్టరీలు తమ గోదాములను ఏర్పాటు చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News