: అలవిగాని కోర్కెలు కోరితే ఎలా.... విపక్షాల తీరుపై టీ సీఎం కేసీఆర్ ఫైర్


నిన్నటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించాయి. సమావేశాలకు అడ్డుతగులుతున్నారని ఆరోపిస్తూ విపక్షాలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అది కూడా ఈ సమావేశాలు ముగిసేదాకా సస్పెన్షన్ విధించింది. సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘అలవిగాని కోర్కెలు’ కోరితే ఎలాగంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ‘‘బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేసి రైతుల అంశంపై చర్చించాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలు కొన్ని డిమాండ్లు చేస్తాయి. అందుకు ప్రభుత్వం కూడా తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుంది. అయితే... ప్రతిపక్షాలు ఆశించినట్లుగానే ప్రభుత్వం స్పందించాలనే వైఖరి మంచిది కాదు. అలవిగాని కోర్కెలు కోరి, దానిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తే ఎలా? ఇదేం పద్ధతి?’’ అని కేసీఆర్ విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా విపక్షాలపై తాము వేసిన సస్పెన్షన్ వేటు సరైనదేనని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News