: పరాన్నజీవులపై పరిశోధనలకు నోబెల్ పురస్కారం...క్యాంప్ బెల్, ఒమురా, యుయు తు లకు గౌరవం
పరాన్నజీవుల (పేరాసైట్స్)పై జరిగిన పరిశోధనలకు ఈ ఏడాది ప్రపంచ అత్యున్నత పురస్కారం ‘నోబెల్’ (వైద్య విభాగం) దక్కింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఫైలేరియా, మలేరియా, ఏలిక పాములు, రివర్ బ్లైండ్ నెస్ వంటి జబ్బులపై పోరాటానికి ఎంతగానో ఉపయోగపడే పరిశోధనలు చేసిన అమెరికా, జపాన్, చైనా దేశాలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు విలియం సి క్యాంప్ బెల్, సంతోషి ఒమురా, యుయు తు లకు నోటెల్ కమిటీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. పురస్కారం కింద అందించనున్న ప్రైజ్ మనీ రూ.6.19 కోట్లలో సగభాగాన్ని చైనా శాస్త్రవేత్త యుయు తుకు ప్రకటించిన నోటెల్ జ్యూరీ మిగిలిన సగభాగాన్ని అమెరికాకు చెందిన క్యాంప్ బెల్, జపాన్ కు చెందిన ఒమురా లు పంచుకుంటారని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 10న స్టాక్ హోమ్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో వీరికి అవార్డును ప్రదానం చేయనున్నట్లు జ్యూరీ కమిటీ తెలిపింది.