: నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు రావడానికి ప్రధాని అంగీకరించారు: సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని, అందుకు ఆయన అంగీకరించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మోదీకి తెలియజేశానన్నారు. నెంబర్ వన్ రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని, అందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని చెప్పానన్నారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి రైతులు హృదయ పూర్వకంగా తమ భూములిచ్చిన విషయాన్ని మోదీ వద్ద ప్రస్తావించానన్నారు. తిరుపతి వచ్చేందుకు కూడా ప్రధాని అంగీకరించారని బాబు చెప్పారు. కాగా, చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియడంతో విజయవాడకు బయలుదేరారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా ఆయన కలిశారు.

  • Loading...

More Telugu News