: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కేసు నమోదు
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. మోదీపై వ్యాఖ్యల నేపథ్యంలో కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఇటీవల బీహార్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అక్బరుద్దీన్, మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశారు.