: మరో రికార్డు అంతు చూసిన గేల్


కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేసిన గేల్.. ఆ తర్వాతా తన రన్ ట్రీట్ మెంట్ కొనసాగించాడు. 53 బంతుల్లోనే 150 మైలురాయిని అధిగమించాడు. కాగా, 17వ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన గేల్.. మరో రికార్డు అంతు చూశాడు. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరునూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు కివీస్ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ (158) పేరిట ఉంది. ప్రస్తుతం గేల్ 58 బంతుల్లో 160 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News