: రాధేమా ఇంట్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లేవు: ముంబయి పోలీసులు


తనని తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకున్న రాధేమా ఇంట్లో తాము సోదాలు నిర్వహించామని, ఎలాంటి అనుమానిత వస్తువులు ఆ ఇంట్లో లభించలేదని ముంబయి హై కోర్టుకు పోలీసులు తెలిపారు. రాధేమా చేతబడులు, క్షుద్ర పూజలకు పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు. ఆమెపై వచ్చిన ఫిర్యాదులపై హైకోర్టు సోమవారం వివరణల్ని రికార్డు చేసింది. ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ఆమెపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News