: ఆ యువకుడు గిటార్ వాయించడంలో చాలా స్పీడ్... అమెరికా రికార్డు బద్దలు కొట్టిన భారతీయుడు


ఆ యువకుడు అత్యంత వేగంగా గిటార్ వాయించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు, అమెరికాకు చెందిన వ్యక్తి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ ఘనత సాధించిన యువకుడు.. మన భారతీయుడే! ఉత్తరాఖండ్ లోని ముస్సోరి ప్రాంతానికి చెందిన నిర్వాణా బిష్త్ అనే యువకుడు ఇక్కడి సెయింట్ జార్జ్ కళాశాలలో చదువుతున్నాడు. ఫైట్ ఆఫ్ ద బంబుల్ బీ... పాటను తాను గిటారుపై వాయిస్తుండగా తీసిన వీడియోను వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు ఆ యువకుడు పంపాడు. ఈ వీడియోను పరిశీలించిన ప్రతినిధులు ప్రపంచంలో అత్యంత వేగంగా గిటార్ వాయించగల యువకుడు నిర్వాణా అంటూ ధ్రువీకరించిన సర్టిఫికెట్ ను అతనికి అందజేశారు. గతంలో అమెరికాకు చెందిన డేనియల్ హైగ్ పేరిట ఈ రికార్డు నెలకొల్పి ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టిన నిర్వాణా చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు, గురువుకు ఆ యువకుడు కృతఙ్ఞతలు తెలిపాడు.

  • Loading...

More Telugu News