: జమ్మూ కాశ్మీర్ సరిహద్దు కాల్పుల్లో బొబ్బిలి జవాన్ మృతి


జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో గత అర్ధరాత్రి జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బొత్త సత్యం(36) చనిపోయాడని తెలిసింది. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాద్రి గ్రామానికి చెందిన అతను సరిహద్దు భద్రతా దళంలో జవాన్ గా పనిచేస్తున్నాడు. సత్యం మరణవార్త కుటుంబ సభ్యులకు ఈ మధ్యాహ్నం తెలియగానే వారు విషాదంలో కూరుకుపోయారు. సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. మూడు రోజుల తరువాత స్వగ్రామానికి అతని మృతదేహం వస్తుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News