: ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారు?: కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ మంత్రులంతా గ్రానైట్, ఇసుక దందాలతో పాటు దొంగనోట్ల వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపించారు. చేయకూడని పనులన్నీ చేస్తున్న మంత్రులు... బయటకు మాత్రం సత్యహరిశ్చంద్రుడి వారసులుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇన్ని జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారని మండిపడ్డారు. దృతరాష్ట్రుడి పాత్రను ప్రస్తుతం కేసీఆర్ పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News