: భారత్ లో ముస్లింల పరిస్థితిపై ఐరాసకు సమాజ్ వాదీ నేత లేఖ


భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కి లేఖ రాశారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితి మెరుగుపరచాలని ఆయన కోరారు. దేశంలో మతహింస పెరిగిపోయిందని తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని దాద్రీలో జరిగిన అఖ్లాక్ హత్య గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. గోమాంసం తిన్నందుకు హత్యలు చేసేవారు... అసలు గోమాంసం అమ్మే హోటళ్లపై దాడులెందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఆవు ఎవరికీ తల్లి కాదు, అదొక జంతువేనని వ్యాఖ్యానించిన జస్టిస్ మార్కండేయ కట్జూపై ఎవ్వరూ దాడి చేయలేదని పేర్కొన్నారు. ఆయన ముస్లిం కాదు కాబట్టే దాడి జరగలేదని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నాయని ఖాన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News