: ప్రత్యేక హోదాను చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న భావన ప్రజల్లో ఉంది: వైకాపా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు మూలకారకుడు చంద్రబాబే అని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదాను చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు అడ్డుకుంటున్నారనే భావన ఇప్పటికే ప్రజల్లో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వల్లే, తమ అధినేత జగన్ నిరాహార దీక్షకు దిగుతున్నారని తెలిపారు. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని నల్లపాడులో నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు.

  • Loading...

More Telugu News