: ఇంట్లోనే నిషేధిత 'మాంజా' నూలు తయారీ కేంద్రం!


గాలిపటాలు ఎగురవేసేందుకు నిషేధిత మాంజా నూలును ఒక ఇంట్లో తయారు చేస్తున్న విషయాన్ని తమిళనాడు పోలీసులు కనుగొన్నారు. నగర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొరట్టూరు వద్ద ఒక ఇంట్లో భారీ మొత్తంలో మాంజా నూలు కండెలు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో పరిశీలించి చూడగా, ఇందుకు సంబంధించిన యంత్రపరికరాలు ఆ ఇంట్లో ఉన్నాయి. దీని యజమాని ఒక వృద్ధుడని సమాచారం. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, గాలిపటం మాంజా నూలు మెడను కోసివేసిన సంఘటనలో అజయ్ అనే బాలుడు ఇటీవల మృతి చెందాడు. అజయ్ మృతిని పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారిని విచారించడంతో చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో మాంజా నూలు తయారీ ఫ్యాక్టరీ కొరట్టూరు లో ఉన్న సమాచారం తెలిసింది.

  • Loading...

More Telugu News