: 'బాహుబలి'పై ప్రశ్నలకు సమాధానమిస్తేనే బీటెక్ సివిల్ ఇంజనీర్లు... ప్రశ్నలన్నీ సినిమాపైనే!


దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో అదొకటి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు అసెస్మెంట్ పరీక్ష జరుగుతోంది. ఇది ఆగస్టు సెమిస్టర్ కు సంబంధించిన పరీక్ష. ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నాపత్రాన్ని అందుకున్న స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ కావాల్సిన పరిస్థితి. ఇంతకూ వారిని అంత షాక్ కు గురి చేసిన ప్రశ్నలు ఏంటో తెలుసా? రాజమౌళి తీసిన బాహుబలి చిత్రంపైనే ప్రశ్నలు! 90 నిమిషాల్లో జవాబులు రాయాలని ఇచ్చిన 50 మార్కుల ప్రశ్నా పత్రంలో 40 మార్కుల ప్రశ్నలు బాహుబలిపైనే. చిత్రం గురించి కొన్ని వివరాలు, ఆపై టెక్నికల్ వివరాలు ఇచ్చిన ప్రశ్నాపత్రంలో, ఓ ఫైటింగ్ సీన్ లో ప్రభాస్, రానాలకు దెబ్బలు తగలకుండా తీసుకున్న జాగ్రత్తలేవి? అని, నువ్వే ఆ సెట్ కు ఇన్ చార్జ్ గా ఉంటే తీసుకునే జాగ్రత్తలేవి? అని ప్రశ్నించారు. కాగా, భవన నిర్మాణాలకు వాడాల్సిన ప్రమాణాలు బాహుబలి సినిమాలో కనిపించాయని కూడా ఉపోద్ఘాతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. మంచి ఇంజనీరింగ్ డిజైన్ ఉందని, నటీనటుల రక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నారని వాటిని బొమ్మల రూపంలో కూడా వివరించారు. అన్నట్టు ఈ ప్రశ్నాపత్రం ఎవరిదో తెలుసా? చెన్నై, వేలూరు కేంద్రాలుగా ఇంజనీరింగ్ కళాశాలల చైన్ నడుపుతున్న ప్రతిష్ఠాత్మక 'వీఐటీ'ది!

  • Loading...

More Telugu News