: మంత్రి భూములు వదిలి, సామాన్యుల భూములు లాక్కుంటారా?: జగన్
రైతుల భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని వైకాపా అధినేత జగన్ హెచ్చరించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం రావివలసలో విమానాశ్రయ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులను ఈ రోజు జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితుల తరపున పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఇదే ప్రాంతంలో మంత్రి అయ్యన్నపాత్రుడి భూములు కూడా ఉన్నాయని... అయితే, ఆయన భూములను వదిలేసి, రైతుల భూములను లాక్కొంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వస్తే, రైతుల నుంచి తీసుకున్న భూములను వెనక్కి ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.