: జమ్మూ కాశ్మీర్ లో గొడ్డుమాంసం అమ్మకం నిషేధంపై సుప్రీం స్టే


జమ్మూ కాశ్మీర్ లో గొడ్డుమాంసం అమ్మకం నిషేధంపై సుప్రీంకోర్టు రెండు నెలల పాటు స్టే విధించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. రాష్ట్ర శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం పశు మాంసంపై నిషేధం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. పశువధ, పశు మాంస విక్రయంపై రాష్ట్ర శిక్షా స్మృతిలోని నిబంధనలను పరిశీలించేందుకు ముగ్గురు న్యాయమూర్తులతో ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News