: వెంకటేశ్వరుడు, శివుడు, సాయిబాబా... దేవుళ్ల రూపంలోని చంద్రబాబును చూస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దైవంతో సమానమయ్యారు. చాలా గ్రామాల్లో ఆయన అభిమానులు పలు దేవుళ్ల రూపాల్లో చంద్రబాబు ప్లెక్సీలను డిజైన్ చేయించి కూడళ్లలో నిలిపారు. ముఖ్యంగా తుళ్లూరు మండలంలో ఈ తరహా ప్లెక్సీలు అధికంగా కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి, శివుడు, సాయిబాబా, కృష్ణుడు... ఇలా వివిధ రూపాల్లో ఆయనున్న పోస్టర్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తమ భూములకు విలువ తీసుకువచ్చారని, పేదలుగా ఉన్న తమను కోటీశ్వరులుగా మార్చారని చెబుతూ పలు రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారి అభిమానాన్ని, దేవుళ్ల రూపంలోని చంద్రబాబును మీరూ చూడండి.