: జగన్ వి పగటి కలలు: డొక్కా


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పగటి కలలు కంటున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్న జగన్, అర్థంపర్థం లేని దీక్షలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని కలలు కన్నా ముఖ్యమంత్రి కావడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి అంతా సహకరించాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన తెలిపారు. కాగా, ఈ మధ్యే డొక్కా టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News