: రాయలసీమకు నీళ్లిచ్చాకే ఆంధ్రాకివ్వాలి: కావూరి హెచ్చరికలు
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని ముందుగా రాయలసీమ ప్రజలకు ఇవ్వాలని బీజేపీ నేత కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రజల నీటి అవసరాలు తీరిన తరువాతే శ్రీశైలం నీటిని ఆంధ్రా ప్రాంతానికి కేటాయించాలని అన్నారు. లేని పక్షంలో రాయలసీమలో మరో ఉద్యమం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం దీనిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కాగా, రాయలసీమ వాసుల నీటి అవసరాలు తీర్చేందుకు పట్టిసీమను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే.