: ప్రతిపక్షాల విధానాలు వేరైనా అజెండా ఒకటే!: రేవంత్ రెడ్డి


తెలంగాణ అసెంబ్లీ మామ కేసీఆర్, అల్లుడు హరీష్ రావుల ఆటస్థలంగా మారిపోయిందని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. వీరిద్దరూ కాసేపు వచ్చి, సభలో ఆటవిడుపుగా కూర్చుని వెళ్లిపోయేందుకే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్టుందని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు రూ. 40 వేల కోట్ల విలువైన టెండర్లను కేసీఆర్ సర్కారు సిద్ధం చేసిందని వ్యాఖ్యానించిన ఆయన, డబ్బున్న రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకునే సర్కారుకు రైతు రుణాలను మాఫీ చేసేందుకు డబ్బు లేదా? అని ప్రశ్నించారు. తక్షణం ఆత్మహత్యలు చేసుకున్న 1400 మంది రైతుల కుటుంబాలకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విధానాలు వేరైనా అజెండా ఒకటే కాబట్టి కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కలసి పోరాటం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News