: అమ్మో ఆ పని నా వల్ల కాదు... జుకర్ బర్గ్ కోరికను తిరస్కరించిన చైనా ప్రెసిడెంట్


ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ అడిగిన చిన్న కోరికను చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తిరస్కరించాడు. ఈ ఆసక్తికర వార్తను షాంఘయిస్ట్ డాట్ కామ్ వెల్లడించింది. మార్క్ ఏం కోరారు, జింగ్ పింగ్ ఏం తిరస్కరించాడో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో ఇచ్చిన విందుకు జిన్ పింగ్ దంపతులతో పాటు మార్క్ జుకర్ బర్గ్ కూడా హాజరయ్యారు. తనకు మాండరిన్ భాష వచ్చి ఉండటంతో మార్క్ జిన్ పింగ్ తో మాటలు కలిపారు. తమకు త్వరలో పాపాయి పుట్టనుందని, ఓ మంచి చైనా పేరు సూచించాలని కోరారు. చైనా పేరు పెట్టడం తాము గొప్ప గౌరవంగా భావిస్తామని కూడా చెప్పారు. దీన్ని విన్న జిన్ పింగ్ ఆనందపడుతూనే, పిల్లలకు పెర్లు పెట్టడం చాలా పెద్ద బాధ్యతని, అది తన వల్ల కాదని చేతులెత్తేశారట. అదండీ సంగతి!

  • Loading...

More Telugu News