: ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ పొడిగింపు
సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిందన్న ఆరోపణలతో కటకటాలు లెక్కపెడుతున్న ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఆమెతోపాటు ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు కూడా కస్టడీని ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఫిట్స్ కి వాడే మందులు అధిక మోతాదులో మింగి, ఆత్మహత్యకు యత్నించిన ఇంద్రాణి ప్రస్తుతం ముంబైలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని వైద్యులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతోంది. దీంతో, ఆమెను ఆసుపత్రి నుంచి జైలుకు తరలిస్తారు.