: గుంటూరులో రేపు నారా లోకేష్ పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు గుంటూరులో పర్యటించనున్నారని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. ఈ సమయంలో పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్న కార్యకర్తలను లోకేష్ అభినందించనున్నట్లు వెల్లడించారు. గుంటూరులో ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్ పై ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కాదు.. కేంద్ర ప్రభుత్వం అని జగన్ కు తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేయాలని చెప్పారు.