: బోరు బావిలో పడ్డా ప్రాణాలతో బయటపడ్డ రెండేళ్ల చిన్నారి!
చిన్నారుల పాలిట మృత్యుద్వారాలుగా మారుతున్న బోరుబావులు ఇప్పటికే ఎందరో ప్రాణాలను బలిగొన్న ఉదంతాలు మనకు తెలుసు. కానీ ఈ చిన్నారి మాత్రం మృత్యుంజయురాలు. బోరు బావిలో 60 అడుగుల లోతుకు పడిపోయి కూడా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన రాజస్థాన్ లోని దౌసా జిల్లా బిహారిపురాలో జరిగింది. నిన్న మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారి జ్యోతి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 200 అడుగుల లోతున్న బావిలోకి జారిపోయి, 60 అడుగుల ప్రదేశంలో ఇరుక్కుపోయింది. గ్రామస్థుల సమాచారంతో స్పందించిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 20 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. పాప స్వల్ప గాయాలతో సురక్షితంగా ఉండటం చూసి అందరూ ఆనందించారు.