: కోర్టు ఎదుట లొంగిపోయిన బంగ్లా క్రికెటర్ షాదత్
బంగ్లాదేశ్ క్రికెటర్ షాదత్ హుస్సేన్ ఇవాళ ఢాకా కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే అతడిని జైలుకు తరలించారు. తమ ఇంట్లో పనిచేసే ఓ మైనర్ బాలికను తీవ్రంగా వేధించి, కొట్టినట్టు సదరు క్రికెటర్, అతని భార్య న్రిట్టో హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో వారిపై కేసు నమోదైంది. అప్పటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన అతని భార్యను పోలీసులు నిన్న(ఆదివారం) అరెస్టు చేశారు. ఈ క్రమంలో షాదత్ కూడా లొంగిపోవాల్సి వచ్చింది. కాగా అతను బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, ఈ సాయంత్రం విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు నేపథ్యంలో షాదత్ ను బంగ్లా క్రికెట్ బోర్టు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసింది.