: దసరా ఉత్సవాలకు దుర్గగుడి మొబైల్ యాప్ లు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ దుర్గమ్మ వారి పేరుపై రెండు మొబైల్ యాప్ లు తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ గుడి ఈవో ఆ యాప్ లను ఆవిష్కరించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పూర్తి సమాచారంతో యాప్ లను రూపొందించినట్టు ఈవో తెలిపారు. అంతేగాక ఉత్సవాల కోసం టోల్ ఫ్రీ నంబర్ (18001217749) ఏర్పాటు చేసినట్టు చెప్పారు.