: ఆ గ్రామంలో సగం మందికి పైగా పచ్చ కామెర్లే!


ఆ గ్రామంలో 250 కుటుంబాల వరకు ఉన్నాయి. గ్రామ జనాభాలో సగం మందికి పైగా పచ్చ కామెర్ల వ్యాధికి గురై, అస్వస్థతకు లోనయ్యారు. ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒకరైనా ఈ వ్యాధికి గురయ్యారు. కొన్ని ఇళ్లలో మొత్తం కుటుంబసభ్యులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ గ్రామం పేరు చిన్న నిజాంపేట. మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో ఉంది. వారికి ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో, మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వెళతున్నారు. అయితే, అక్కడ కూడా డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి చిన్న నిజాంపేట గ్రామస్తుల్లో నెలకొంది.

  • Loading...

More Telugu News