: ఢిల్లీలో సాగరమాల ప్రాజెక్టుపై సమావేశం ప్రారంభం... చంద్రబాబు హాజరు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ ప్రాజెక్టుపై ఢిల్లీలో సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్ లో ఈ సమావేశం జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, సముద్రతీర ప్రాంతం రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. వారితో పాటు ఆర్థిక, జలవనరులు, రైల్వే గ్రామీణాభివృద్ధి, పర్యాటక, చిన్నతరహా పరిశ్రమలు, పౌర విమానయాన శాఖల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.