: ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహావిష్కరణ


హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వెనుక పార్కులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత జి.వెంకటస్వామి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కాకా కుమారులు వినోద్, వివేక్, పలువురు కాకా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కాకా విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన కొన్ని రోజుల్లోనే చకచకా విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, కాకా విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. కాకా నిజమైన తెలంగాణ బిడ్డ అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన బాటలో నేటి యువత నడిచి ఆశయాలను కొనసాగించాలని సూచించారు.

  • Loading...

More Telugu News