: నాన్-సైన్స్ పట్టభద్రులకు స్వాగతం పలుకుతున్న విప్రో
నిన్నమొన్నటి వరకూ సైన్స్ గ్రాడ్యుయేట్లు, బీఎస్సీ డిగ్రీ చదివిన వారిని శిక్షణకు తీసుకుని వారికి బిట్స్ పిలానీ ద్వారా తమకు ఉపయోగపడేలా తయారు చేసుకుంటున్న విప్రో మైండ్ సెట్ మారింది. ఇండియాలో మూడవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థగా పనిచేస్తున్న విప్రో ఇప్పుడు గత సంప్రదాయాలను పక్కనబెట్టి కామర్స్, ఫైన్ ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లను కూడా తీసుకుంటోంది. వీరిని మౌలిక సేవల నిర్వహణ, యాప్ మద్దతు సేవల విభాగాల్లోకి తీసుకుంటున్నామని సంస్థ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ విభాగం హెడ్ సౌరవ్ గోవిల్ తెలిపారు. ఐఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు నాన్-సైన్స్ విద్యార్థులనూ తీసుకుంటున్నామని, ప్రస్తుతానికి వారి సంఖ్య స్వల్పమే అయినప్పటికీ, తదుపరి మరింతగా పెంచుతామని తెలిపారు. భవిష్యత్తులో ఈ-కామర్స్ విభాగం విస్తరణపై భారీ ఆశలున్న నేపథ్యంలో ఆ రంగంలోనూ సేవలందించే దిశగా యోచిస్తున్న సంస్థ ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.